అమెరికాలో తెలంగాణ యువకుడి కాల్చివేత
- అన్షుల్ పిజ్జా డెలివరీ చేస్తుండగా దుండగుల కాల్పులు
- నార్త్ ఫిలడెల్ఫియాలో ఘటన
- మృతుడిని మేడ్చల్ జిల్లా వాసిగా గుర్తింపు
ఉపాధి నిమిత్తం అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నార్త్ ఫిలడెల్ఫియాలో పిజ్జా డెలివరీ చేస్తుండగా గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో అతడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన కుంచ అన్షుల్‌గా గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే, అన్షుల్ అమెరికాలో పిజ్జా డెలివరీ బాయ్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగే విధుల్లో భాగంగా పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లగా, దుండగులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అన్షుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. అన్షుల్ మరణవార్త విన్న అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుమారుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించేలా ప్రభుత్వం చొరవ చూపాలని వారు అధికారులను వేడుకుంటున్నారు.